ఆశీర్వదిస్తుంటే, హైఫైవ్‌ కొట్టింది..వైరల్ 

తాజా వార్తలు

Published : 25/10/2020 02:08 IST

ఆశీర్వదిస్తుంటే, హైఫైవ్‌ కొట్టింది..వైరల్ 

దిల్లీ: చర్చిలో ఫాదర్‌ ఆశీర్వదిస్తున్న సందర్భంలో ఓ చిన్నారి అమాయకపు చర్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల పెదాలపై చిరునవ్వులు పూయిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..తెల్లని దుస్తుల్లో, దానికి తగ్గట్టుగా మాస్క్‌ ధరించి అందంగా ముస్తాబైన ఓ పాప తన తల్లితో కలిసి చర్చిలో ఫాదర్‌ వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లింది. అప్పుడు ఫాదర్ ఆశీర్వదించడానికి చేయిపైకెత్తగానే ఆ చిన్నారి వెంటనే హైఫైవ్‌ అంటూ తన చేయిపైకెత్తింది. ఆ బాలిక అమాయకపు చర్యకు ఆయన కూడా ఆశ్చర్యపోయి, నవ్వును ఆపుకుంటూనే ఆ తల్లీకూతుళ్లను ఆశీర్వదించారు. మరోవైపు బాలిక చేయిని ఆమె తల్లి పట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

‘ఫాదర్ ఆశీర్వాదం ఇవ్వడం. ఆ పాప అమాయకత్వం. నవ్వకూడదని వారు ప్రయత్నించడం. మంచి విషయాన్ని ఈ రోజు చూడండి’ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వీడియోకు పెద్దఎత్తున లైక్స్‌, కామెంట్లు వచ్చాయి. అయితే ఇంకేం, మీరు ఓసారి ఆ వీడియో చూసేయండి. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని