TS Lockdown:క‌ఠిన ఆంక్ష‌లు..ముమ్మ‌ర త‌నిఖీలు

తాజా వార్తలు

Updated : 22/05/2021 14:30 IST

 TS Lockdown:క‌ఠిన ఆంక్ష‌లు..ముమ్మ‌ర త‌నిఖీలు

హైద‌రాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఉద‌యం 10.10 గంట‌ల త‌ర్వాత ఎవ‌రూ బ‌య‌ట తిర‌గ‌కూడ‌ద‌ని సీఎం తెలిపిన‌ నేప‌థ్యంలో ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. న‌గ‌రంతో పాటు జిల్లాల్లోనూ వాహ‌నాల త‌నిఖీని పోలీసులు మ‌మ్మురం చేశారు. పాస్‌లు, అనుమ‌తులు లేని వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. బేగంపేట‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్క వాహనాన్ని ఆపుతున్న పోలీసులు అనుమ‌తి ఉంటేనే పంపిస్తున్నారు. లాక్‌డౌన్ అమ‌లును డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రిశీలించారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఆయ‌న ఆకస్మిక త‌నిఖీలు చేశారు. 

హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ పంజాగుట్ట‌, బంజారాహిల్స్‌, బేగంపేట‌లో లాక్‌డౌన్ అమ‌లు తీరును ప‌రిశీలించారు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా భారీ సంఖ్య‌లో వాహ‌నాలు బ‌య‌టికి రావ‌డంతో పోలీసులు త‌నిఖీలు చేసి ప‌దుల సంఖ్య‌లో కార్లు, బైకుల‌ను సీజ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్య‌లో వాహనాలు స్తంభించాయి. రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఉప్ప‌ల్‌లో ప‌ర్య‌టించారు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల అమ‌లును ప‌ర్య‌వేక్షించారు. 

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే వాహ‌నాల సీజ్‌: సీపీ సజ్జ‌నార్‌

అత్తాపూర్‌, బోర‌బండ‌, మోతీన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల అమ‌లును ప‌రిశీలించారు. అనుమ‌తులు లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తున్న వాహ‌నాల‌ను సీజ్ చేయిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కే గూడ్సు వాహ‌నాల‌కు అనుమ‌తి అని వివ‌రించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని