ఊపిరితిత్తులు కోలుకుంటున్నాయి!

తాజా వార్తలు

Published : 09/09/2020 12:20 IST

ఊపిరితిత్తులు కోలుకుంటున్నాయి!

వాటంతట అవే సాధారణ స్థితికి..

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఒకసారి వైరస్‌ సోకి.. ఆ తర్వాత నెగిటివ్‌గా నిర్ధారణ అయినా కూడా అవి పూర్తిగా కోలుకున్న ఛాయలు కనిపించడం లేదని తెలుస్తోంది. కొవిడ్ తరవాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.  అయితే తాజాగా ఈ అంశంపై ఆస్ట్రియా పరిశోధకులు చేసిన అధ్యయనం సానుకూల సంకేతాలను ఇచ్చింది.

దాని ప్రకారం..కరోనా వైరస్‌ సోకి తీవ్రంగా ప్రభావితమైన 82 మంది వ్యక్తులు కోలుకున్న 6, 12, 24 వారాల తరవాత వారి కార్డియో-పల్మనరీకి జరిగిన నష్టంపై పరిశోధన జరిపారు. ఆరు వారాలు, 12 వారాల తరవాత ఆ కోలుకున్నవారి సిటీ స్కాన్‌ను పరిశీలించగా..ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తున్నట్లు గుర్తించారు. వైరస్‌ నుంచి బయటపడిన వారాల తరవాత ఊపిరితిత్తులు వాటంతట అవే మామూలు స్థితికి వచ్చే సామర్థ్యాన్ని చూపించినట్లు వెల్లడవుతోందన్నారు. వాటికి సంబంధించి సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు దోహదం చేస్తుందని, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఆందోళన తగ్గటం వంటి విషయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని వెల్లడించారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా ఊపిరితిత్తులకు నష్టం జరుగుతున్నందు వల్ల తాజా నిరూపణ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుందని తెలిపారు. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేశారు. 

ఈ అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్ గులేరియా మీడియాతో మాట్లాడారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా 20 నుంచి 30 శాతం కేసుల్లో ఊపిరితిత్తుల్లో మచ్చలు కనిపించాయన్నారు. కొన్ని కేసుల్లో మినహా శరీరానికి ఉన్న సహజమైన రోగ నిరోధకశక్తి కారణంగా వాటంతట అవే కోలుకుంటున్నాయని తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని