vaccination: టీకా వేసుకుంటే.. చూపొచ్చిందట

తాజా వార్తలు

Published : 05/07/2021 18:32 IST

vaccination: టీకా వేసుకుంటే.. చూపొచ్చిందట

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా టీకా తీసుకుంటే చాలామందికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. కానీ, మహారాష్ట్రలోని ఓ మహిళకు వ్యాక్సిన్‌ వేసుకోగానే ఎప్పుడో పోయిన కంటిచూపు తిరిగొచ్చింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమట. జాతీయ మీడియా వార్తా కథనం ప్రకారం వాసింకు చెందిన 70 ఏళ్ల మహిళ మధురాబాయి బిదవే తొమ్మిదేళ్ల కిందట కాటరాక్ట్‌ శస్త్ర చికిత్స చేయించుకుంది. వైద్యుల నిర్లక్ష్యమో, మరొకటోగానీ తను పూర్తిగా చూపు కోల్పోయింది. అప్పట్నుంచి బంధువుల ఆసరాతో జీవితం నెట్టుకొస్తోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డ తర్వాత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున టీకా వేయించుకోవాలనే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందరిలాగే జూన్‌ 26న మధురాబాయి ఓ కేంద్రానికి వెళ్లి కొవిషీల్డ్‌ టీకా తీసుకుంది. చిత్రంగా ఆ మరునాటి నుంచే ఆమెకు కళ్లు కనిపించడం మొదలయ్యాయట. ఇదే విషయం అందరికీ చెప్పడంతో చుట్టుపక్కల వాళ్లంతా దీన్నో వింతగా భావించడం మొదలుపెట్టారు. కొందరు కంటి వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమెకు పాక్షికంగా చూపు రావడానికి వ్యాక్సినా? లేక మరేదైనా కారణముందా అనేది తేల్చడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారట.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని