హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో బాంబు పేలుడు
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 16:00 IST

హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో బాంబు పేలుడు

లాహోర్‌: ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి,  లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరిని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత్‌ గాలిస్తున్న అత్యంత ప్రధానమైన అయిదుగురు ఉగ్రవాదుల్లో హఫీజ్‌ సయీద్‌ ఒకడు. 

బాంబు పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హఫీజ్‌ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ద్విచక్ర వాహనాన్ని నిలిపాడని.. కొద్ది సేపటి తర్వాత అది పేలిపోయిందని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు. బాంబు దాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బుజ్దార్‌ ట్వీట్ చేశారు. తాజా ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న జిన్నా ఆసుపత్రి ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని