అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

తాజా వార్తలు

Updated : 05/05/2021 14:14 IST

అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

మాలి: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అద్భుతం చోటుచేసుకుంది. మంగళవారం ఓ మహిళ ఒకే కాన్పులో 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. కాగా వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హాలిమా సిస్సే (25) అనే మహిళ గర్భం దాల్చగా మార్చిలో ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించారు. మంగళవారం హాలిమా సిస్సేకి నొప్పులు రావడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా అనుకున్నదానికంటే ఇద్దరు శిశువులు అధికంగా జన్మించడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 9 మంది జన్మించగా అందులో ఐదుగురు ఆడ శిశువులు, నలుగురు మగవారు. కాగా తల్లీబిడ్డలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు మాలీ ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సిబే ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే కాన్పులో ఇంతమందికి జన్మనివ్వడమే కాకుండా వారందరూ క్షేమంగా ఉండటం ఓ అద్భుతమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని