చాంతాడంత చలాన్‌

తాజా వార్తలు

Published : 23/03/2021 15:09 IST

చాంతాడంత చలాన్‌

కరీంనగర్‌: భారీగా చలాన్‌ పెండింగ్‌ ఉన్న ఓ వ్యక్తిని కరీంనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనంపై 54 చలాన్లకు సంబంధించి ₹15,884లను పోలీసులు కట్టించుకున్నారు. అతి పొడవైన చలాన్‌ రసీదును చూపించారు. ఈ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌, నంబర్‌ ప్లేట్లను తీసివేయడం, తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్నారన్న సమాచారంతో ఎల్‌ఎండీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్‌ ప్లేట్లు లేని 25 వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ₹65,975లను వాహనదారుల నుంచి కట్టించుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని