TS news: మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి!

తాజా వార్తలు

Updated : 26/06/2021 13:01 IST

TS news: మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి!

హైదరాబాద్: ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్‌ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది. శారద గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు  సమాచారముందని మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కరోనాబారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన కోరారు. పోలీస్‌ శాఖ తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని