TS News: మ‌ధుక‌ర్‌ది హ‌త్యే: మావోయిస్టుల లేఖ

తాజా వార్తలు

Updated : 08/06/2021 15:10 IST

TS News: మ‌ధుక‌ర్‌ది హ‌త్యే: మావోయిస్టుల లేఖ

హైద‌రాబాద్‌: మావోయిస్టు నేత మ‌ధుక‌ర్‌ను పోలీసులే క్రూరంగా హింసించి హ‌త్య చేశార‌ని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేర‌కు ద‌క్షిణ స‌బ్ జోన‌ల్ పేరుతో దండ‌కార‌ణ్య అధికార ప్ర‌తినిధి స‌మ‌త లేఖ విడుద‌ల చేశారు. క‌రోనా బారిన ప‌డి చికిత్స కోసం వ‌చ్చిన మ‌ధుక‌ర్‌ను ఈ నెల ఒక‌టో తేదీ వ‌రంగ‌ల్‌లో పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అత‌డికి క‌నీసం వైద్య సేవ‌లు అందించ‌కుండా ఐదు రోజుల పాటు హింసించార‌ని.. ఆరో తేదీన‌ అనారోగ్యంతో చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌టించార‌ని స‌మ‌త ఆరోపించారు. గ‌త నెల 27న ప్లాటూన్ క‌మాండర్ గంగాల్‌ను కూడా ఇదే త‌ర‌హాలో హ‌త్య చేసిన‌ట్లు పేర్కొన్నారు. మ‌ధుక‌ర్‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘటించిన ద‌క్షిణ స‌బ్ జోన‌ల్ బ్యూరో.. ఆయ‌న ఆశ‌యాలను కొన‌సాగిస్తామ‌ని లేఖ‌లో పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని