TS news: వర్షాకాలం.. జీహెచ్‌ఎంసీ సన్నద్ధం

తాజా వార్తలు

Updated : 07/06/2021 19:52 IST

TS news: వర్షాకాలం.. జీహెచ్‌ఎంసీ సన్నద్ధం

హైదరాబాద్‌: వర్షకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా నాలాల పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మేయర్‌ విజయలక్ష్మి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ, పూడికతీత పనుల పురోగతిపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. 

గతేడాది భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయలక్ష్మి సూచించారు. గత పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జూన్‌ నెలాఖరుకల్లా నాలా పూడికతీత పనులు పూర్తిచేయాలన్నారు. వర్షపునీరు సులభంగా వెళ్లేందుకు నాలా విస్తరణ, అభివృద్ది పనులకు సంబంధించి రూ.858 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించామని,  వీటికి సంబంధించి డీపీఆర్‌లను పూర్తిచేసి టెండర్లను ఆహ్వానించాలని తెలిపారు. 
పూడికతీత పనులకు సంబంధించిన సమాచారాన్ని వార్డుల వారిగా జియో మ్యాపింగ్‌తో కూడిన ఫొటోల వివరాలు అందించాలని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. నాలా పూడికతీత పనులు పూర్తయ్యాయని, అయినప్పటికీ తిరిగి వర్షం కురిసిన తర్వాత కూడా నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని