మద్యం నుంచి వినసొంపైన సంగీతం

తాజా వార్తలు

Updated : 22/02/2021 05:16 IST

మద్యం నుంచి వినసొంపైన సంగీతం

రోమ్‌: ఇటలీకి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్ల సరికొత్త ఆవిష్కరణతో మద్యం ఇకపై రుచి, కిక్కుతో పాటు సంగీతాన్ని వినిపించనుంది. ద్రవాల కదలిక సూత్రం ఆధారంగా వైన్‌ నుంచి సంగీతం స్వరపరిచిన ఇంజినీర్లు ఔరా అనిపిస్తున్నారు. నాణ్యమైన మద్యం గొప్ప సంగీతాన్ని వినిపిస్తుందని మద్యం నుంచి మ్యూజిక్‌ను స్వరపరిచిన వాయిద్యకారుడు ఫిలిప్పో కోసెంటినో పేర్కొన్నారు. ఇటలీలో జనాదరణ పొందిన బరోలో రెడ్‌ వైన్‌ నుంచి వినసొంపైన సంగీతాన్ని తాము సృష్టించినట్లు ఆయన తెలిపారు. ద్రవాల కదలిక ధర్మం ఆధారంగా వైన్‌ నుంచి శబ్దాలను సృష్టించినట్లు ఆయన వివరించారు. సృష్టిలో ఒక్కో ద్రవానికి ఒక్కో కదలిక ధర్మం ఉంటుంది. వాటిలో ఏదైనా అలజడి సృష్టిస్తే శబ్ద ధర్మమూ ఉంటుంది. వైన్‌కు కూడా ఆ రెండు ధర్మాలు ఉంటాయని ఈ ఇద్దరు సౌండ్‌ ఇంజినీర్లు నిరూపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని