AP News: ఏపీలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 14:23 IST

AP News: ఏపీలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌

అమరావతి: ఆంధ్రప్ర‌దేశ్‌లో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది.  8 లక్షల నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా వైద్యారోగ్య‌శాఖ‌ ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు విజయవాడ నుంచి వెళ్లాయి. మిగ‌తా జిల్లాల‌కు 50వేల టీకా డోసులు పంపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న‌ తల్లులు ఏపీలో సుమారు 18 లక్షల మంది ఉన్నారు. వీరిలో శనివారం వరకు 28% మంది తొలి టీకా వేయించుకున్నారు. 

మిగిలిన వారిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరితో పాటు 45 సంవత్సరాలు పైబడిన వారికి తొలి టీకా వేస్తారు. రెండో డోసుకు అర్హత కలిగిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశాన్ని కుదిరినంత వరకు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. విదేశాల‌కు వెళ్లే వారికి కూడా నేడు వ్యాక్సిన్ వేయ‌నున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని