HYD: హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ 
close

తాజా వార్తలు

Updated : 06/06/2021 17:13 IST

HYD: హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ 

హైద‌రాబాద్‌: క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భాగంగా న‌గ‌రంలో నిర్వ‌హిస్తున్న అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కొన‌సాగుతోంది. హైటెక్స్ లో మొత్తం 30 హాళ్ల‌లో ఏర్పాటు చేసిన 300 టేబుళ్ల వ‌ద్ద టీకాలు వేస్తున్నారు. తొలి గంట‌లో 5 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఒకేచోట 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్‌ దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. ఇందుకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ కేంద్రం వేదిక  అయింది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆసుపత్రులు ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. 

ఈ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరిగే ఈ డ్రైవ్‌లో సుమారు 5 వేలకు పైగా ఐటీ ఉద్యోగులు, గేటెడ్‌ కమ్యూనిటీలు పాల్గొనే అవకాశముంటుంది. మెడిక‌వ‌ర్‌ ఆసుపత్రుల‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పేరు న‌మోదు చేసుకున్న వారికే టీకా పొందేందుకు అవ‌కాశం ఉంది. 

కొవిడ్ టీకా తీసుకునేందుకు ఇటీవ‌ల‌ ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నగరవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో వాహకులుగా గుర్తించిన వారికి టీకాలు వేయిస్తోంది. పలు కేంద్రాల్లో రెండో డోసు టీకాలూ వేస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో వందల మంది నివసించే ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. మరోవైపు పలుచోట్ల మెగా టీకాల డ్రైవ్‌లు పెద్దఎత్తున సాగుతున్నాయి.

భారీగా ట్రాఫిక్ జామ్‌..

మాదాపూర్ హైటెక్స్‌లో న‌డుస్తున్న మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు ప్ర‌జ‌లు, ఉద్యోగులు భారీగా త‌ర‌లిరావ‌డంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. మాదాపూర్ హైటెక్ సిటీ చౌర‌స్తా నుంచి హైటెక్స్ వ‌ర‌కూ మూడు కిలోమీట‌ర్ల మేర వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఒకే రోజు 40 వేల మంది వ్యాక్సినేష‌న్ కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డంతో భారీగా ర‌ద్దీ ఏర్ప‌డింది. సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల ర‌ద్దీని నియంత్రిస్తున్నారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని