Raghurama: ఆ నంబ‌ర్ నుంచి ఐఏఎస్‌కు మెసేజ్‌లు

తాజా వార్తలు

Published : 05/06/2021 15:39 IST

Raghurama: ఆ నంబ‌ర్ నుంచి ఐఏఎస్‌కు మెసేజ్‌లు

అమ‌రావ‌తి: నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు పేరిట త‌న‌కు సందేశాలు వ‌స్తున్నాయ‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. 9000911111 నంబ‌ర్ నుంచి త‌న‌తో పాటు త‌న బంధువుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోసం ఈ స‌మాచారం పంచుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. పీవీ ర‌మేశ్ ట్వీట్‌పై ఎంపీ ర‌ఘురామ‌రాజు స్పందించారు.

త‌న మొబైల్‌ను మే 14న సీఐడీ పోలీసులు అన‌ధికారికంగా సీజ్ చేశార‌ని.. ట్విట‌ర్‌లో స‌మాధాన‌మిచ్చారు. త‌న ఫోన్ సీఐడీ అధికారుల వ‌ద్దే ఉంద‌ని.. తిరిగి ఇవ్వాల‌ని లీగ‌ల్ నోటీస్ ఇచ్చిన‌ట్లు ర‌ఘురామ‌కృష్ణరాజు పేర్కొన్నారు. మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు ఆ నెంబ‌ర్ నుంచి తాను ఎవ‌రికీ మెసేజ్‌లు పంప‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగు రోజుల కిందట ఆ సిమ్ బ్లాక్ చేసి కొత్త‌ది తీసుకున్న‌ట్లు వివరించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి త‌న ఫోన్ నెంబ‌ర్‌ను దుర్వినియోగం చేసిన‌ట్ల‌యితే సీఐడీ అద‌న‌పు డీజీ సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ర‌ఘురామ తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని