కత్తి మహేశ్‌ మృతిపై స్పందించిన ఏపీ మంత్రి

తాజా వార్తలు

Published : 15/07/2021 01:27 IST

కత్తి మహేశ్‌ మృతిపై స్పందించిన ఏపీ మంత్రి

అమరావతి: సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ మృతిపై పలు ఆరోపణలు వస్తుండటంతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పందించారు. కత్తి మహేశ్‌ మృతిపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

కత్తి మహేశ్‌ చికిత్సకు ప్రభుత్వం రూ.17లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన కుటుంబానికి వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్‌ చేస్తున్న సురేష్‌ను నెల్లూరు పిలిపించిన పోలీసులు కోవూరు స్టేషన్‌లో విచారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని