ప్రజల భాగస్వామ్యం అవసరం: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 01/05/2021 17:52 IST

ప్రజల భాగస్వామ్యం అవసరం: ఆళ్ల నాని

కాకినాడ: కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం మరింత అవసరమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ నియంత్రణ, టీకా ప్రక్రియ వేగవతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో అధికార యంత్రాంగంతో మంత్రి చర్చించారు. ఆక్సిజన్ వినియోగం పట్ల  కొందరు బాధితులకు అవగాహన లేకపోవడం వల్ల 20శాతం వృథాగా పోతున్నట్లు గుర్తించామన్నారు. 104 వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పడకల సంఖ్య పెంచుతున్నామని.. అలాగే రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోనూ కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని