Remdesivir: అక్రమాలకు పాల్పడితే చర్యలు

తాజా వార్తలు

Published : 30/04/2021 16:25 IST

Remdesivir: అక్రమాలకు పాల్పడితే చర్యలు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో రెమ్‌డెసివిర్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ విక్రయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లో కొవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రులకు తగినన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నామని.. వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 420 టన్నుల ఆక్సిజన్‌ను సమర్థంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు. 25 నుంచి 30 శాతం ఆక్సిజన్‌ వృథాగా పోతుందని.. వృథా నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను అధికమించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని