పక్కరాష్ట్రాల ధాన్యం రాకుండా చూడాలి: గంగుల
close

తాజా వార్తలు

Published : 12/04/2021 16:33 IST

పక్కరాష్ట్రాల ధాన్యం రాకుండా చూడాలి: గంగుల

హైదరాబాద్‌: పంటలను రైతులే అమ్ముకునేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ కొనుగోలుపై కేంద్రంతో మాట్లాడి సీఎం ఒప్పించారన్నారు. తరుగు లేకుండా ధాన్యం ఆరబెట్టుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎంఎస్‌పీ రాష్ట్రంలో ఎక్కువగా ఉందని.. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. గన్ని బ్యాగుల కొరతపై మరో 2, 3 రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు టోకెన్‌ పద్ధతిలో ఉంటుందని వివరించారు. మెడవిరుపు తెగులు వల్ల ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారని గంగుల అన్నారు. ఈ విషయంలో రైతులకు వ్యవసాయాధికారులు సూచనలు చేయాలని మంత్రి ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని