రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి కేటీఆర్‌ సాయం

తాజా వార్తలు

Published : 27/07/2021 00:36 IST

రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి కేటీఆర్‌ సాయం

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మంత్రి కేటీఆర్‌ సాయమందించారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి పంపించారు. ఈ సంఘటన సిద్దిపేట మెడికల్‌ కళాశాల సమీపంలో జరిగింది. ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ అటునుంచి వెళ్తున్న క్రమంలో.. తీవ్రగాయాలతో రోడ్డుపై పడిఉన్న వారిని చూసి కాన్వాయ్‌ ఆపారు. వెంటనే తన కాన్వాయ్‌లోని రెండు కార్లలో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్‌ వైద్యులకు ఫోన్‌ ద్వారా సూచించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని