KTR: రాష్ట్రంలో కైటెక్స్‌ పెట్టుబడి.. ప్రత్యక్షంగా 22వేల మందికి ఉపాధి: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 18/09/2021 15:04 IST

KTR: రాష్ట్రంలో కైటెక్స్‌ పెట్టుబడి.. ప్రత్యక్షంగా 22వేల మందికి ఉపాధి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్‌ గ్రూపు కేరళ బయట విస్తరణ కోసం చూస్తున్నప్పుడు ఆ సంస్థను తాము సంప్రదించామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ నెలకొల్పాలంటూ కైటెక్స్‌కు వివిధ ప్రభుత్వాల నుంచి వినతులు, హామీలు వచ్చాయని.. అయితే, తెలంగాణ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ ప్రతినిధులను ఇక్కడకు రప్పించినట్టు చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కైటెక్స్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలో తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తంచేసిన ఆ సంస్థ.. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు గతంలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఎంవోయూ కుదిరింది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్‌కు కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా చందన్‌పల్లిలో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమ ఏర్పాటుకు కైటెక్స్‌ సిద్ధమైంది. రూ. 2400 కోట్లపెట్టుబడి పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ పరిశ్రమతో 22వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ పరిశ్రమలో 85 నుంచి 90శాతం మహిళలకు ఉపాధి దొరుకుతుంది. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్‌ కొనుగోలు చేయనుంది. కైటెక్స్‌తో 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీఎస్‌ఆర్‌ కింద రూ.6కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్‌ ఇవ్వనుంది. కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’’ అని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని