ఆ ఖర్చుని పీఎంకేర్స్‌ నుంచి భరించలేరా: KTR
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 12:07 IST

ఆ ఖర్చుని పీఎంకేర్స్‌ నుంచి భరించలేరా: KTR

హైదరాబాద్‌: దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై మంత్రి కేటీఆర్‌ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. ‘‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్‌ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?ఒకే దేశం- ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే కరోనా ‘కొవిషీల్డ్‌’ టీకా ధరలను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) నిన్న ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే డోసు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర రూ.600గా ఉంటుందని ఆ సంస్థ సీఈఓ అదర్‌ సి.పూనావాలా బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని