కృష్ణా జలాలపై రాజీ పడం: కేటీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 10/07/2021 15:36 IST

కృష్ణా జలాలపై రాజీ పడం: కేటీఆర్‌ 

నారాయణపేట: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ఉందని చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా? అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ రైతు బంధు, కేసీఆర్‌ కిట్ లాంటి పథకాలు కర్ణాటకలో ఉన్నాయా?ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబన్‌వన్‌ స్థానంలో ఉంది. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు. చట్టప్రకారం రావాల్సిన వాటాను సాధించుకుంటాం. కేసీఆర్‌ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కోట్లాడతాం’’ అని కేటీఆర్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని