ఐదేళ్లలో ఆరు పోర్టుల అభివృద్ధి: గౌతమ్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 19:01 IST

ఐదేళ్లలో ఆరు పోర్టుల అభివృద్ధి: గౌతమ్‌రెడ్డి

అమరావతి: ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ముసాయిదా వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. మైనర్ పోర్టులపై నియంత్రణ కేంద్రానికి వెళ్లటం ద్వారా రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అధ్యయనం కోసం నిపుణుల కమిటీ నియమిస్తామన్నారు. అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాటం చేస్తామన్నారు. మరోవైపు మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఏపీలోని పోర్టుల సామర్థ్యాలను భవిష్యత్‌ మౌలిక అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాలని.. వచ్చే ఐదేళ్లలో ఆరు పోర్టులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. రామాయపట్నం పోర్టు పనులు ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభిస్తామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని