బాల్యవివాహాలతో అంధకారంలో ఆడపిల్లల భవిష్యత్
close

తాజా వార్తలు

Published : 12/06/2021 19:50 IST

బాల్యవివాహాలతో అంధకారంలో ఆడపిల్లల భవిష్యత్

వెబినార్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి వెబినార్ నిర్వహించారు. విద్య, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నప్పటికీ సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగడం దురదృష్టకరమన్నారు. బాల్యవివాహాలతో ఆడపిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా గిరిజనులు, పేదవాళ్లు ఉన్న ప్రాంతమని.. ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయని మంత్రి అన్నారు. ఆలస్యం అవుతున్నకొద్దీ సరైన సంబంధం దొరకకపోవచ్చనే భయం తల్లిదండ్రుల్లో ఉంటుందన్నారు.

‘‘బాల్యవివాహాలను అరికట్టేందుకే సీఎం కేసీఆర్ 18 ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయికి పెళ్లి చేయడాన్ని ప్రోత్సహించాలనుకున్నారు. అందుకే కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారు. బాల్యవివాహాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. బాల్యవివాహాలు చేయడానికి గల కారణాలు, పరిస్థితులపై అధ్యయనం చేసి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు ఉండాలి. బాల్యవివాహాల విషయంలో ఆడపిల్ల తల్లిదండ్రులకన్నా ముందు అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని అవగాహన కల్పించాలి’’ అని మంత్రి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని