నిమజ్జనానికి వచ్చేవారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి: మంత్రి తలసాని

తాజా వార్తలు

Updated : 19/09/2021 13:38 IST

నిమజ్జనానికి వచ్చేవారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి: మంత్రి తలసాని

హైదరాబాద్‌: గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కొవిడ్  నిబంధనల మేరకు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ట్యాంక్‌బండ్‌ వద్దకు వచ్చే నేపథ్యంలో.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తగిన స్థాయిలో క్రేన్లు కూడా ఉన్నాయని వివరించారు. ప్రమాదాలు సంభవించకుండా గజ ఈతగాళ్లు, పడవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని