Ts News: అన్నిశాఖల సమన్వయంతో బోనాలు
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 14:18 IST

Ts News: అన్నిశాఖల సమన్వయంతో బోనాలు

హైదరాబాద్‌: ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జులై 13న గోల్కొండలో ప్రభుత్వ లాంఛనాలతో బోనాల పండుగ ప్రారంభం కానుందని చెప్పారు. ఆషాఢ మాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. 

గతేడాది కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత కారణంగా వేడుకలను సరిగా నిర్వహించలేకపోయామని మంత్రులు అన్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రేటర్‌లో అన్ని ఆలయ కమిటీలకు ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తామని చెప్పారు. బోనాల పేరిట ఎవరూ చందాలు వసూలు చేయకూడదని.. ప్రభుత్వమే రూ.15కోట్లు విడుదల చేసిందని మంత్రులు వెల్లడించారు. సాంస్కృతిక, విద్యుత్‌, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహిస్తామన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డీజీపీతో పాటు మూడు కమిషనరేట్ల పరిధిలోని సీపీలు నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని