అంబేడ్కర్‌ ఆశయాలు కొనగిస్తున్నాం:కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 12:15 IST

అంబేడ్కర్‌ ఆశయాలు కొనగిస్తున్నాం:కేటీఆర్‌

హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్‌ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. గతంలో చెప్పినట్లుగానే త్వరలోనే దేశంలోకెల్లా అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ప్రతిష్ఠించబోతున్నట్లు ప్రకటించారు. 

‘‘అందరికీ సమాన హక్కులు ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారు. బోధించు, సమీకరించూ, పోరాడూ అని అంబేడ్కర్‌ చెప్పారు. అంబేడ్కర్‌ మార్గంలోనే కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. రాజ్యంగబద్దంగా తెలంగాణ సాధించుకున్నాం. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహానికి ఇవాళ ఆమోదం తెలుపుతాం. త్వరలోనే విగ్రహ నిర్మాణం చేపడతాం. గురుకులాలు స్థాపించి అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తున్నాం’’ అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

నేటికి పోరాడటం దురదృష్టకరం:ఈటల 
అణగారిన వర్గాల కోసం అంబేడ్కర్‌ పోరాడారని మంత్రి ఈటల అన్నారు. కుల, మత రహిత సమాజమే ఆయన లక్ష్యమని వివరించారు. నేటికి రిజర్వేషన్ల కోసం పోరాడటం దురదృష్టకరం అని ఈటల అన్నారు. పాలకులు రాజ్యాంగాన్ని పఠనం చేసి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని