పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ: పెద్దిరెడ్డి
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 04:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ: పెద్దిరెడ్డి

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల తక్షణ పరిహారం

అమరావతి: క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లాలోని మామిళ్లపల్లె క్వారీలో పేలుడు సంభవించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందుతుందన్నారు. తక్షణ పరిహారంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ.5 లక్షల సాయమందిస్తున్నట్లు ఆయన వివరించారు. క్వారీ లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌ నిబంధనలు పాటించలేదన్నారు. 

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని తిరుమలకొండ ముగ్గురాయి గనుల్లో నిన్న జరిగిన భారీ పేలుళ్లలో 10 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. భూమి లోపల గనుల తవ్వకాలు జరిపేందుకు వీలుగా వేంపల్లె నుంచి కారులో భారీగా జిలెట¨న్‌ స్టిక్స్‌ను తీసుకొచ్చారు. వాటి¨ని కూలీల సహాయంతో భద్రతా చర్యలు తీసుకోకుండా దింపుతుండగా ప్రమాదం జరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని