కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌ 

తాజా వార్తలు

Updated : 14/03/2021 11:02 IST

కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌ 

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ 8 గంటలకు ప్రారంభమైంది. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది.  

సమర్థులకే ఓటేయాలి: కేటీఆర్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలన్నారు. విద్యావంతులు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని చెప్పారు. 
సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తాను ఓటేశానని తెలిపారు. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటేశానని కేటీఆర్‌ అన్నారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని