మరో 2-3 రోజుల్లో భారత్‌కు మోడెర్నా టీకా
close

తాజా వార్తలు

Published : 03/07/2021 01:16 IST

మరో 2-3 రోజుల్లో భారత్‌కు మోడెర్నా టీకా

దిల్లీ: దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ల వినియోగం జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి మోడెర్నా వచ్చి చేరనుంది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) నుంచి ఆమోదం లభించిన అనంతరం అమెరికా తయారీ సంస్థ రూపొందించిన మోడెర్నా భారత్‌కు చేరుకునేందుకు 2-3 రోజులు పడుతుందని ఆ సంస్థ పేర్కొంది.  మోడెర్నా టీకాను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిప్లా సంస్థ ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకా సరఫరా, నిర్వహణ ఉండనుంది. ప్రతి రాష్ట్రానికి కేంద్రమే దీన్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా .. మోడెర్నా టీకాను పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, భారత్‌లో ఉపయోగించే వాఇలో ఇది నాలుగో వ్యాక్సిన్‌.

94.1 శాతం రక్షణ

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మోడెర్నా తొలిడోస్‌ టీకా తీసుకున్నాక.. వైరస్‌బారిన పడకుండా 94.1శాతం రక్షణ పొందవచ్చని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు.. సార్స్‌ కొవ్‌-2తో పాటు బి.1.1.7, 501వై.వి2తో పాటు ఇతర వ్యాధులపై టీకా సమర్థంగా పనిచేయనన్నుట్లు పలు ఆధారాలతో నిరూపితమైనట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని