రాష్ట్రాల వద్ద 1.89 కోట్లకుపైగా డోసులు: కేంద్రం
close

తాజా వార్తలు

Published : 24/06/2021 20:39 IST

రాష్ట్రాల వద్ద 1.89 కోట్లకుపైగా డోసులు: కేంద్రం

దిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.89 కోట్ల డోసులకుపైగా కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఉదయం నాటికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. కొత్తగా సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 21న ప్రారంభించిన వ్యాక్సినేషన్‌లో భాగంగా తొలి 72 గంటల్లోనే 2 కోట్ల డోసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 30 కోట్లకుపైగా డోసులను ఉచితంగా అందజేసినట్లు తెలిపింది. వాటిలో వృథా అయినవాటితో కలిపి 28,43,40,936  డోసులను ప్రజలకు ఇచ్చినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా పంపిణీ పరిధిని విస్తరించడం సహా.. వ్యాక్సినేషన్‌ ప్రకియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించింది. టీకాల లభ్యత, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద తగినన్ని టీకాలను అందుబాటులో ఉంచేందుకోసం ముందస్తు ప్రణాళికను రూపొందించామని తెలిపింది. టీకాల సరఫరా గొలుసు క్రమబద్ధీకరణ ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని పేర్కొంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో భాగంగా టీకాలను ఉచితంగా అందజేస్తూ రాష్ట్రాలకు సహకరిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాల్లో 75 శాతం డోసులను కేంద్రం సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పింది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని