Corona: ఏపీలో ఒక్కరోజే 69 మరణాలు

తాజా వార్తలు

Published : 25/04/2021 18:20 IST

Corona: ఏపీలో ఒక్కరోజే 69 మరణాలు

24 గంటల వ్యవధిలో 12వేలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 62,885 పరీక్షలు నిర్వహించగా.. 12,634 కేసులు నిర్ధారణ కాగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,33,560 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు; తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; అనంతపురం, కడప ఐదుగురు చొప్పున; చిత్తూరు, గుంటూరులో నలుగురేసి; ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,685కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,304 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,36,143కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,680 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 మంది వైరస్‌ బారినపడ్డారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని