Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 06/05/2021 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. మూడు నెలలకో కొత్త రకం!

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలకో వైరస్‌ రకం అధికంగా వ్యాప్తిలో ఉంటోంది. రూపాంతరం చెందుతున్న కొవిడ్‌ వైరస్‌లు కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. తొలిదశ ఉద్ధృతిలో ప్రధానంగా మూడు రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉండగా.. రెండో దశలో ఒకటి కనుమరుగై మరొకటి అధిక వ్యాప్తికి కారణమవుతోంది. ఒక్కోరకం మూడు నుంచి ఆరునెలల వరకు ప్రభావం చూపిస్తున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈటల భార్య పేరిట గోదాములకు అనుమతుల్లేవు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య పేరిట ఉన్న గోదాములకు అనుమతులు లేవని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు బుధవారం గుర్తించారు. హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల్లో 219 గోదాములు ఉండగా.. వాటిల్లో కేవలం మూడింటికే హెచ్‌ఎండీఏ అనుమతి ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా  ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Corona: 2 వారాల్లో మూడింతలు

తెలంగాణలో అవసరాల మేరకు ఆసుపత్రుల్లో పడకలను పెంచుకుంటూ పోతుంటే దానికంటే ముందుగా కొవిడ్‌ పరుగులు తీస్తూ సర్కారుకు సవాలు విసురుతోంది. గత రెండు వారాల్లో ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూలో వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న పడకల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇంతకంటే వేగంగా ఈ రెండూ అవసరమైన కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఐసీయూలోకి వెళ్తున్న రోగుల సంఖ్య రెండువారాల్లో వేలల్లో దూసుకుపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఆధునిక సీటీస్కాన్‌ 5-10 ఎక్స్‌రేలతోనే సమానం

ఒక సీటీస్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానమని.. కొవిడ్‌పై అనుమానంతో అనవసరంగా పదేపదే సీటీస్కాన్‌ తీయించుకోవద్దంటూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల చేసిన ప్రకటనపై భారత రేడియలాజికల్‌, ఇమేజింగ్‌ అసోసియేషన్‌ (ఐఆర్‌ఐఏ) మండిపడింది. ప్రస్తుత ఆధునిక రూపం సంతరించుకున్న సీటీస్కాన్‌లు 5-10 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానమని.. 300-400 ఎక్స్‌రేలన్నది ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం నాటి మాట అని ఆ ప్రకటనలో ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఐటీ సంస్థలపై సైబర్‌ దాడులు

కరోనా వైరస్‌ ఓవైపు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తుండగా.. కొందరు దీన్ని సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న ఐటీ, కార్పొరేట్‌ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధాన కార్యాలయాల్లో వినియోగిస్తున్న వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) వాడడం లేదు. వీరి నెట్‌వర్క్‌లోని భద్రత లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరస్థులు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోకి ఫిషింగ్‌, ఇతర మెయిల్స్‌ ద్వారా చొరబడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పదవీ విరమణ తర్వాత ఏడాది వరకూ తాత్కాలిక పింఛను

తాత్కాలిక పింఛనుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తేదీ నుంచి ఏడాది వరకూ తాత్కాలిక పింఛను చెల్లించేలా గడువును పొడిగించింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం వెల్లడించారు. అర్హులైన కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను క్లెయిము రసీదు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే పింఛనును మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మూలకణాలతో మేలు చేస్తాం!

మానవాళికి మేలు చేసే పరిశోధనలు చేసి... ఒక శాస్త్రవేత్తగా మాత్రమే మిగిలిపోవాలనుకోలేదామె! ఆ పరిశోధనల ఫలితాలని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు... ఎన్నో సవాళ్లని ఎదుర్కొని మూలకణ ఆధారిత ఔషధాల తయారీ మొదలు పెట్టారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ ద్రావిడ సుభద్ర. ఆమె ముందుచూపే నేడు కొవిడ్‌పై పోరాటంలో ఓ వెలుగురేఖగా మారింది.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. భూమిపై కూలనున్న China రాకెట్‌?

అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్‌ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. అయితే- ఆ రాకెట్‌ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Mother's Day: అమ్మను మించి దైవమున్నదా?

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ... దైవం కన్నా ముందు అమ్మకే అత్యున్నత స్థానం కల్పించింది మన సంప్రదాయం. మాతృదేవోభవ అని అమ్మకే తొలి గౌరవం ఇచ్చాం. భగవంతుడు అన్ని చోట్లా ఉండే వీల్లేక తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు. అమ్మదనమంటే బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ. కాన్పు కష్టాన్ని రైలు పట్టాల మీద నలిగే నాణెంతో పోల్చారు ఓ కవయిత్రి. కాబట్టే అమ్మదనానికి లోకం చేతులు జోడిస్తుంది. పేగు బంధానికి నమస్కరిస్తుంది. మాతృదినోత్సవం(మే 9న)పై కథనం కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని