Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 07/05/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1Lockdown ఉండదు: KCR

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి ·కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కూడా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Corona: ఆసుపత్రులకు 5 సూత్రాలు

అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యులు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్‌.. ఈ అయిదూ ఉండేలా చూసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. వైద్యులు లేకుంటే వెంటనే నియమించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ పరిస్థితులపై అధికారులతో గురువారం సీఎం  సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Covid రోగులకు ప్రత్యేక ఓపీ

కొవిడ్‌ రోగులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆరోగ్య ఉపకేంద్రం(సబ్‌సెంటర్‌) మొదలుకొని బోధనాసుపత్రుల దాకా అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా ఓపీ సేవలకు ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ వైద్యంలోనే కాదు.. ప్రైవేటులోనూ ఈ సేవలను ప్రారంభించాలని తీర్మానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రెండు మాస్కులతో అధిక రక్షణ

కరోనా విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం చేసింది. ఇందులోనూ లోపలి భాగంలో సర్జికల్‌ మాస్కును, పైభాగంలో క్లాత్‌ మాస్కును ధరిస్తే.. మెరుగైన ఫలితాలుంటాయని తేల్చిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Corona: అలక్ష్యమే శత్రువు

కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడి నయం చేసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కొందరు వైద్య నిపుణులూ గట్టిగా చెబుతున్నారు. మరో పక్క ‘ఆసుపత్రికి రావడంలో ఆలస్యం చేశారు. మా వద్దకు వచ్చేటప్పటికే వ్యాధి చాలా ముదిరింది. ముందే వచ్చుంటే ప్రాణాలు దక్కేవి’ అన్న మాటలూ కరోనా సెకండ్‌వేవ్‌లో తరచూ వింటున్నాం. ఇలాంటి పరస్పర విరుద్ధమైన భావనలు బాధితులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమేం చేయాలి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. చిన్నారుల ఆసరాకు సంప్రదించండి..

కరోనాతో తల్లి లేక తండ్రి చనిపోయి.. ఆసరా కోల్పోయిన పిల్లల సంరక్షణకు, తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడిన వారి పిల్లలకు తాత్కాలిక పునరావాసానికి శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పథకాల సహాయం కింద ఆయా కుటుంబాల అవసరాలు తీర్చడం, పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పించడం చేస్తోంది. గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడానికీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. భారత్‌ పరిస్థితి అందరికీ హెచ్చరిక: యునిసెఫ్‌

భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా విషాదం మిగిలిన దేశాలకు హెచ్చరికలాంటిదని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ- యునిసెఫ్‌ వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు, వైరస్‌లో వస్తున్న మార్పులు, వివిధ సరఫరాల్లో జరుగుతున్న ఆలస్యాలు...ఇవన్నీ గమనించదగ్గవేనని పేర్కొంది. ప్రపంచమంతా ప్రస్తుతం భారత్‌కు సహాయపడాలని, లేదంటే దాని ప్రభావం ఇతర దేశాలపై పడుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్నియెట్టా ఫోర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. స్పుత్నిక్‌ లైట్‌.. ఒకే డోస్‌ టీకా

రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణలో మరో మైలురాయిని చేరుకుంది. రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకాను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తాజాగా ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. జంబో జట్టుతో.. ఇంగ్లిష్‌ గడ్డకు

కరోనా కాటుతో ఐపీఎల్‌-14 నిరవధిక వాయిదా పడడంతో ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ఇప్పుడెలాగో ఖాళీ సమయం ఉంది కాబట్టి.. వీలైనంత ముందుగానే అక్కడికి చేరుకుని  పరిస్థితులకు అలవాటు పడాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపైనే జరిగే అయిదు టెస్టుల సిరీస్‌ కోసం కలిపి 30 మంది భారత ఆటగాళ్లతో జంబో బృందాన్ని   శుక్రవారం ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మనసుకు అక్షరం..ప్రేమకు అమృతం

భిన్న భావాలను ఒడిసిపట్టి తన కలంలో సిరాగా నింపి, ‘తెలుగు పాట’కు హృదయాన్ని చిగురింపజేసింది మనసు కవి ఆత్రేయ. మనసు ముక్కలయ్యే శబ్దాన్ని వినిపిస్తారాయన. అది అథఃపాతాళంలోకి జారుతున్న తీరును కళ్లకు కడతారాయన. మనసు మంటల్లో కాలిపోతున్నప్పుడు చేసే ఆక్రందనలను పాటగా కూర్చగలరాయన. ఎవ్వరికీ అర్థంకానీ మనసునీ... ‘తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా’ అందరికీ అర్థమయ్యే  పదాలతో ఆవిష్కరించారు కాబట్టే ఆచార్య ఆత్రేయను తెలుగు సినీ పాటల పూదోటల్లో పూసిన సినీవేమన అంటారు. ఆయన శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని