Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదు

నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నీళ్లలో పడితే నీరుగారి పోతుందని.. అక్కడి నుంచి వ్యాపిస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనాతో చనిపోయిన పలువురి మృతదేహాలను యమునా నదిలో పడేస్తుండటంతో ఆ నీటి నుంచి మహమ్మారి వ్యాపిస్తుందేమోనని ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనల గురించి అడిగినప్పుడు ఆయన ఈమేరకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇష్టానుసారం CT Scan వద్దు

కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌ పాత్ర చాలా కీలకం. బాధితుడి లక్షణాల తీవ్రతను బట్టి ఎవరు ఎప్పుడు సీటీ స్కాన్‌ చేయించుకోవాలనేది వైద్యనిపుణులు మాత్రమే సూచించాల్సిన అంశం. అలా కాకుండా ఎవరికివారే తొందరపడినా.. అవసరమైన సందర్భాల్లో జాప్యం చేసినా.. కొవిడ్‌ తీవ్రతకు గురి కావాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటివి నివారించడంలో సీటీ స్కాన్‌ ఎంత మేరకు ఉపయోగపడుతుంది? అసలు దీనివల్ల ఏం తెలుస్తుంది? కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌కున్న ప్రాధాన్యమేమిటి? తదితర అంశాలపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

3. Covid Vaccine: మొదటి డోసు నిలిపివేత

కొవిడ్‌ టీకాలలో రెండో డోసు వారికే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిషీల్డ్‌ వేయించుకొని 6 వారాలు గడిచినవారికి.. కొవాగ్జిన్‌ తీసుకొని 4 వారాలు నిండినవారికి టీకాలను వేస్తారు. పరిస్థితి తీవ్రతను, టీకాల లభ్యతను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. శనివారం నుంచి రెండోడోసు టీకాలను పొందడానికి అర్హులైన వారందరూ స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా సమీపంలోని ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ప్రధానికి జగన్‌ మద్దతుపై ట్వీట్ల యుద్ధం!

కరోనా నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన ఫోన్‌ సంభాషణను విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేయడం, దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఖండించడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానికి మద్దతుగా జగన్‌ ట్వీట్‌ చేయడాన్ని ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Covid Vaccine.. దొరికేనా?

ఏపీలో కొవిడ్‌ టీకాల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. టీకాల కోసం పంపిణీ కేంద్రాల చుట్టూ అర్హులు నిత్యం తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా, కర్ఫ్యూ అమల్లో ఉన్నా రోడ్లపైకి వస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద సరైన సమాచారమిచ్చే వారు కనిపించడం లేదు. మలి విడత డోసు పొందేందుకు గడువు ముగుస్తున్న వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కళ్ల ముందే Corona నరకం

కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన తమవారిని ఆస్పత్రిలో చేర్చేవరకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆ తర్వాత ఇంజెక్షన్లు, మాత్రల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమవారి ప్రాణాలను కాపాడుకునేందుకు చెప్పులరిగేలా తిరుగుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆస్పత్రుల ఆవరణలో, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జొన్నలో సరికొత్త వంగడం

పదిహేనేళ్ల కృషి తరువాతవికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జొన్నలో కొత్తగా తొలి వంగడాన్ని ఆవిష్కరించారు. నల్లరేగడి నేలల్లో సాగుకు  అనువైన ఈ వంగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాల్సి ఉందని వారంటున్నారు. జొన్నలో కొత్త వంగడాలను సృజించడానికి శాస్త్రవేత్తలు 2006 నుంచి కృషి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జొన్న విత్తనాలను క్రాసింగ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Immunity: రోగనిరోధక శక్తికి ఇదీ డైట్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ముప్పు నుంచి బయటపడేందుకు డబుల్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు రోగ నిరోధకశక్తి పెంచుకోవాలంటూ నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన ఆహార నియమాలతో శరీరానికి అధిక పోషకాలు అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కొవిడ్‌ను వదిలేసి విమర్శకులపై కొరడా

కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ విమర్శనాత్మక సంపాదకీయం రాసింది. ‘‘కరోనా కట్టడిలో వచ్చిన ప్రారంభ విజయాలను భారత్‌ చేజేతులా నాశనం చేసుకొంది. ఏప్రిల్‌ వరకు కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షోభం దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలి’’ అని లాన్సెట్‌ సంపాదకీయం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

10. WTC: హార్దిక్‌పై వేటు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, దాని తర్వాత ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ కోసం అనుకున్నట్లే భారత సెలక్టర్లు జంబో జట్టును ఎంపిక చేశారు. నలుగురు స్టాండ్‌బైలు కలిపి మొత్తం 24 మంది ఇంగ్లాండ్‌ విమానం ఎక్కబోతున్నారు. చివరగా సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు భారత జట్టులో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌లపై సెలక్టర్లు వేటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* టోక్యో బెర్తు పట్టేసింది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని