Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 12/05/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. TS Lockdown: తాళం పడింది

తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పదిరోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు సడలింపు ఉంటుంది. అత్యవసర సేవలు, ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* వద్దనుకున్నా తప్పడంలేదు: KCR

* Lockdown: హడావుడిగా సొంతూళ్లకు 

2. Ruia: నాలుగున్నర గంటల ఆలస్యం

ప్రాణవాయువు సరఫరాలో జరిగిన ఆలస్యం 11 మంది ఆయువు తీసింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరా తగ్గడంతో బాధితులు మృత్యువాతపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్నాయని ముందుగానే గుర్తించినా.. తమిళనాడు నుంచి ట్యాంకర్‌ సకాలంలో రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపారు. అనుకున్న సమయం కన్నా సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా ట్యాంకర్‌ వచ్చినట్లు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. దేశంలో విచ్చలవిడిగా Plasma Therapy

దేశంలో కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేయడానికి కాన్వలసెంట్‌ ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా ఉపయోగిస్తున్నారని పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌ రాఘవన్‌కు ఒక లేఖ రాశారు. దీనిపై ప్రముఖ టీకా నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌, శస్త్రచికిత్స నిపుణులు పరమేశ్‌ సి.ఎస్‌., భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులు సంతకాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. AIG: అపోహలు వీడు.. కరోనాతో పోరాడు

కొవిడ్‌ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కొవిడ్‌పై రకరకాల అపోహలు, అపనమ్మకాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం ఒక మార్గదర్శిని(గైడ్‌)ని రూపొందించింది. ఆసుపత్రి ఛైర్మన్‌ డా।। డి.నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ డా।। జి.వి.రావు దీనిని విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జులై వరకూ రెండో దశ ఉద్ధృతి

భారత్‌లో కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి జులై వరకూ కొనసాగే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ అంచనా వేశారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో పరిస్థితులు కుదుటపడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Coronaకి బహుళ వ్యూహాలతోనే చెక్‌! 

6. Coronavaccine: అన్ని వైరస్‌లకూ చెక్‌పెట్టేలా..

కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్‌ రకాలు, గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్‌లపైనా ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కోతులు, ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వివరించారు. మానవుల్లోనూ ఇదే ఫలితం రావొచ్చని పేర్కొన్నారు. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బార్టన్‌ ఎఫ్‌ హేన్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ టీకాను అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Steroids: ఆయుధమే.. అప్రమత్తంగా వాడాలి! 

7. తప్పుడు లెక్కే భారత్‌ కొంప ముంచింది: ఫౌచీ

కరోనా వైరస్‌ను అంతమొందించే విషయంలో భారత్‌ తప్పుడు లెక్క వేయడం వల్లనే ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ‘అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ’ డైరెక్టర్‌, అధ్యక్షుని ముఖ్య వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఇక కరోనా బెడద లేదనుకుని వ్యవస్థలన్నింటినీ తెరవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని సెనెట్‌లోని సంబంధిత కమిటీకి మంగళవారం ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నా కెరీర్‌ విరాట్‌ పుణ్యం: సిరాజ్‌

తాను కెరీర్లో ఇప్పుడున్న స్థాయిలో ఉండటానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే కారణమని హైదరాబాదీ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. కష్టకాలంలో కోహ్లి ఇచ్చిన భరోసాను, ప్రోత్సాహాన్ని తాను ఎప్పటికీ మరువలేనని అతను చెప్పాడు. గత ఏడాది చివర్లో సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అతడి తండ్రి చనిపోవడం, క్వారంటైన్‌ నిబంధనల కారణంగా అతను అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోవడం తెలిసిందే. ఆ బాధాకర పరిస్థితుల్లో కోహ్లి తనకు గొప్ప అండనిచ్చినట్లు సిరాజ్‌ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత్‌తో చర్చలు: ఇమ్రాన్‌

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేవరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. జమ్మూ-కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో భారత్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కమ్ముకున్న యుద్ధ మేఘాలు!

ఇజ్రాయెల్‌లో కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధ రూపు సంతరించుకుంటున్నాయి! భీకర దాడులతో అటు ఇజ్రాయెల్‌, ఇటు గాజా తాజాగా దద్దరిల్లాయి. గాజా నుంచి 500కు పైగా రాకెట్లను హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించగా.. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని