Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 22/09/2021 09:06 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. త్వరలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపు!

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుదల అంశాలపై వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలపై సమీక్షించారు.

* స్మార్ట్‌ తెలంగాణ!

2. AP News: ప్రకాశం జిల్లాలో వైకాపా ఎంపీటీసీ అదృశ్యం

ప్రకాశం జిల్లా యనమదలలో వైకాపా ఎంపీటీసీ శాంసన్‌ అదృశ్యమయ్యారు. యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైకాపాలో రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ శాంసన్‌ అదృశ్యం కావడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. సోమవారం నుంచి తన భర్త శాంసన్‌ కనిపించడం లేదంటూ ఆయన భార్య పరమగీతం యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

3. పాలమూరు-రంగారెడ్డి పనులను నిలిపేయండి

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)ని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1, 2లో దీనికి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా లేదని తెలిపింది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందంటూ ఎన్జీటీ ఎదుట రెండు అఫిడవిట్లను మంగళవారం దాఖలు చేసింది.

4. డబుల్‌ బెడ్‌రూం: దళారుల దందా

పేదలకు ఉచితంగా కట్టిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకానికి స్థానిక నాయకులు తూట్లు పొడుస్తున్నారు. స్థలాల కొరతను సాకుగా తీసుకుని, వారు దళారుల అవతారమెత్తారు. కొన్నిచోట్ల పేదల నుంచి సొమ్ము వసూలు చేసి, స్థలాలు కొనుగోలు చేయిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. 

దళారీ చేతిలో దర్శనం

ఆరోగ్యశ్రీలో వసూల్‌ రాజాలు...

5. కాన్పుకొస్తే కోత!

తల్లీబిడ్డలిద్దరికీ ఎలాంటి హాని లేకుండా.. సహజప్రసవం జరిగే రోజులు కనుమరుగైపోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఏపీలో 2,51,900 ప్రసవాలు జరిగితే, వాటిలో 1,05,142 (41.7%) సిజేరియన్లే! వీటిలో ప్రభుత్వాసుపత్రుల్లో 35,762 (34%), ప్రైవేటు ఆసుపత్రుల్లో 69,380 (66%) జరిగాయి. ఆధునిక సదుపాయాలు ఉండే బోధనాసుపత్రుల నుంచి.. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల ఆసుపత్రుల వరకూ అన్నింటా ఇదే ధోరణి.

6. ప్రధాని మోదీ అమెరికా పయనం నేడు

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బయల్దేరి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఐరాస సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సుల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 24న శ్వేతసౌధంలో అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌తో, అంతకు ముందురోజు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ భేటీ అవుతారు. 26న తిరిగి భారత్‌కు వస్తారు. బైడెన్‌-మోదీ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలతో పాటు.. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

కీలక మలుపులో అగ్రదౌత్యం

7. Covishield: అక్టోబర్‌లోనే 22 కోట్ల డోసులు అందుబాటులో..!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఒక్క అక్టోబర్‌ నెలలోనే దాదాపు 22కోట్ల కొవిషీల్డ్‌ (Covishield) డోసులను అందుబాటులో ఉంచుతామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) ప్రకటించింది.

8. IPL 2021: రాజస్థాన్‌ ఆఖర్లో అద్భుతం

ఐపీఎల్‌ రెండో అంచెను రాజస్థాన్‌ సంచలన విజయంతో ఆరంభించింది. మంగళవారం 2 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఓపెనర్లు మయాంక్‌ (67; 43 బంతుల్లో 7×4, 2×6), రాహుల్‌ (49; 33 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో 186 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించిన పంజాబ్‌.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కార్తీక్‌ త్యాగి (2/29) సంచలన ఆఖరి ఓవర్‌ ఫలితంగా ఊహించని విధంగా ఓటమి చవిచూసింది.

పంకజ్‌ 24వ సారి

9. విలువలే శ్వాసగా.. విప్రో 75 ఏళ్ల ప్రయాణం

దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో విప్రో ఒకటి. వంట నూనెల కంపెనీగా ప్రారంభమై, క్రమంగా ఎన్నో వ్యాపారాలకు విస్తరించి ప్రపంచ ఖ్యాతి గడించింది. ఈ సంస్థ 75 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ‘ద స్టోరీ ఆఫ్‌ విప్రో’ పేరుతో ఓ పుస్తకాన్ని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ విడుదల చేశారు. వెస్ట్‌లాండ్‌ పబ్లికేషన్స్‌ దీనిని ప్రచురించింది. ఈ సందర్భంగా విప్రో ప్రయాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అజీమ్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు.

10. యాప్‌స్టోర్‌, ప్లేస్టోర్‌లలో 8 లక్షల యాప్‌లపై నిషేధం

గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘హెచ్‌1 2021 డీలిస్టెడ్‌ మొబైల్ యాప్స్‌ రిపోర్ట్‌’ పేరుతో పిక్సలేట్‌ ఒక నివేదిక రూపొందించింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్‌ వంటి వాటి ద్వారా యూజర్ డేటా సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని