శిథిలదశలో పాక్‌లోని హిందూ ఆలయాలు

తాజా వార్తలు

Published : 09/02/2021 01:48 IST

శిథిలదశలో పాక్‌లోని హిందూ ఆలయాలు

వెల్లడిస్తున్న నివేదికలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు సరైన ఆదరణకు నోచుకోక జీర్ణదశలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పరిశీలించిన కమిషన్‌ ఫిబ్రవరి 5న ఈ నివేదికను పాకిస్థాన్‌ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ ఆలయాలను నిర్వహించాల్సిన బాధ్యత ఎవక్యూ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ)దేనని ఆ నివేదికలో పేర్కొన్నారు. వారు ఈ చారిత్రక ప్రాచీన ఆలయాలను సంరక్షించడంలో విఫలమయ్యారని తెలిపారు. డాక్టర్‌ సొహైబ్‌ సుద్లే నేతృత్వంలోని ఈ కమిషన్‌లో డాక్టర్‌ రమేశ్‌, సాకిబ్‌ జిలానీ, పాకిస్థాన్‌ అటార్నీ జనరల్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించే కార్యక్రమాలు ప్రారంభించాలని ఈ నివేదిక సూచించింది. ఈ మేరకు హిందూ, సిక్కు దేవాలయాలను పరిరక్షించేందుకు ఈటీపీబీ చట్టాల్లో సవరణలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. దేవాలయాల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.

గతేడాది డిసెంబరులో పాక్‌లోని ఓ హిందూ దేవాలయానికి కొందరు మంటలు పెట్టారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా దానిని పునర్నిర్మించాలని సుప్రీం ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు పాకిస్థాన్‌లో ఈటీపీబీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఈటీపీబీ వివరాల ప్రకారం మొత్తం 365 దేవాలయాలు ఉండగా వాటిలో 13 ఆలయాలను మాత్రమే ఈటీపీబీ నిర్వహిస్తోందని తెలిపారు. 65 దేవాలయాలు హిందువులు నడుపుతుండగా మిగిలినవన్నీ కబ్జాకు గురయ్యాయని వారు తెలిపారు. ఈటీపీబీ స్పందనపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. సాంకేతికత మెరుగ్గా ఉన్న ఈ కాలంలో కూడా ఆలయాలను, వాటి ఆస్తులను వీరు రక్షించలేకపోవడం సరికాదన్నారు.

అధికారిక వివరాల ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 75లక్షల హిందువులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం సింధ్‌ ప్రావిన్స్‌లోనే జీవిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

ఒక్క ఫోన్‌కాల్‌.. 12 ప్రాణాలు

చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని