విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి

తాజా వార్తలు

Updated : 12/07/2021 18:13 IST

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని కోరుతూ జగన్‌ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న  వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని కోరారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్‌ వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. విజయసాయి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. అనంతరం విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.మరోవైపు ఓబులాపురం గనుల కేసు సీబీఐ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వక మెమో ఇచ్చింది. కేసు విచారణను వేగంగా చేపట్టాలని కోర్టును కోరింది. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని ఐఏఎస్‌ శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రతిని సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని