TS News: మల్కాజిగిరి డీసీపీపై సీత‌క్క ఆగ్ర‌హం

తాజా వార్తలు

Updated : 03/06/2021 14:32 IST

TS News: మల్కాజిగిరి డీసీపీపై సీత‌క్క ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌: మ‌ల్కాజిగిరి డీసీపీ ర‌క్షిత క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తించార‌ని ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా సోకి త‌న త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌ని.. హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. ఆమెకు ర‌క్తం ఇవ్వ‌డానికి ములుగు నుంచి వ‌చ్చిన త‌న కుటుంబ స‌భ్యుల‌ను డీసీపీ ర‌క్షిత అర‌గంట పాటు అడ్డుకున్నార‌ని ఆరోపించారు.  తాను వీడియో కాల్ చేసి మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించినా డీసీపీ అందుబాటులోకి రాలేద‌ని.. త‌మ వాళ్ల‌ను నానా మాట‌లు అన్నార‌ని సీత‌క్క ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక ఎమ్మెల్యే అయిన త‌న‌కే ఇలా జ‌రిగితే సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని