మా స్కూల్లో ఇలాంటి శిక్షలు ఉండేవి: మహీంద్రా

తాజా వార్తలు

Updated : 31/03/2021 12:34 IST

మా స్కూల్లో ఇలాంటి శిక్షలు ఉండేవి: మహీంద్రా

ముంబయి: రెండో దశ కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న ముంబయిలో ప్రభుత్వం కఠిన నిబంధలు విధిస్తోంది. అయినా కొందరు వాటిని పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో మాస్కులు ధరించని వారితో పోలీసులు ‘డక్‌ వాక్‌’ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. తాను చదివిన బోర్డింగ్‌ స్కూల్‌లో సాధారణంగా ఇలాంటి శిక్ష విధించేవారని పేర్కొన్నారు. ఆ శిక్షను ఉద్దేశించి.. ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌ మర్చిపోను అని చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని