IPL 2021: ఆరంభమంతా దూకుడు.. ఆఖర్లో చేతులెత్తేసిన ముంబయి

తాజా వార్తలు

Updated : 23/09/2021 21:38 IST

IPL 2021: ఆరంభమంతా దూకుడు.. ఆఖర్లో చేతులెత్తేసిన ముంబయి

అబుదాబి: ఆరంభంలో ఓపెనర్లు అదరగొట్టేశారు.. భారీ స్కోరు సాధించేస్తారేమో అన్నంతగా దూకుడుగా ఆడారు. అయితే మధ్య ఓవర్లలో ప్రత్యర్థి కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఎడిషన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు పరిస్థితి ఇదీ. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడిన ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్‌ (55) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ శర్మ భారీ షాట్‌కు యత్నించి కోల్‌కతా బౌలర్‌ సునిల్‌ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యాడు. సూర్యకుమార్‌తోపాటు అప్పటి వరకు నిలకడగా ఆడిన డికాక్‌ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు చేర్చాడు. ఇషాన్‌ కిషన్‌ (14), కృనాల్ పాండ్య (12) ఆకట్టుకోలేకపోయారు. కీరన్‌ పొలార్డ్‌ (21) ఫర్వాలేదనిపించినా.. దూకుడుగా ఆడలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సునిల్‌ నరైన్ ఒక వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని