పచ్చదనం మనందరి బాధ్యత: నాగార్జున

తాజా వార్తలు

Published : 26/12/2020 16:39 IST

పచ్చదనం మనందరి బాధ్యత: నాగార్జున

హైదరాబాద్‌: పచ్చదనం కోసం మరిన్ని చెట్లు నాటాలని, అది మనందరి బాధ్యతని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు. ‘వైల్డ్‌డాగ్‌’తో పాటు, ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ షూటింగ్‌లతో బిజీగా గడిపిన ఆయన ప్రస్తుతం కాస్త విరామం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. వాల్గో ఇన్‌ఫ్రా ఎండీ, సీఈవో శ్రీధర్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. పార్క్‌లో ప్రత్యేకమైన చెట్లను పెంచాలన్నారు.

అనంతరం అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీరారు. మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నారితో కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని