Viral: మాస్క్‌-లీసా.. శానిటైజర్‌-లీసా..

తాజా వార్తలు

Published : 09/07/2021 01:27 IST

Viral: మాస్క్‌-లీసా.. శానిటైజర్‌-లీసా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నిబంధనలు, వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కలిగించడానికి  నాగపూర్‌ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. అందుకోసం లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలీసా చిత్రాన్ని ఎంచుకున్నారు. మోనాలీసా చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి ముఖానికి మాస్క్‌, చేతిలో శానిటైజర్‌ను ఉంచారు. మరో చిత్రంలో మోనాలీసా టీకా వేయించుకున్నట్టు చిత్రీకరించారు. వాటికి మాస్క్‌-లీసా, శానిటైజర్‌-లీసా, వాక్సిన్‌-లీసా అని పేర్లు కూడా పెట్టారు. ఆ చిత్రాలను ట్విట్టర్  ద్వారా పంచుకోగా.. వాటిని చూసిన నెటిజన్లు పోలీసుల క్రియేటివిటీ అదిరిపోయిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘లియోనార్డో డా నాగపూర్‌ పోలీస్‌’ అని వారికి కితాబు ఇస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని