Nalgonda:పోలీసుల అత్యుత్సాహం..కరెంట్‌ కట్‌

తాజా వార్తలు

Updated : 22/05/2021 18:54 IST

Nalgonda:పోలీసుల అత్యుత్సాహం..కరెంట్‌ కట్‌

నల్గొండ క్రైం: కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కార్యాకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్రమే వెసులుబాటు ఉంది. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు. శనివారం నల్గొండలో పోలీసులు ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు. ఈ నేపథ్యంలో ఓ విద్యుత్‌ ఉద్యోగిపై దాడి చేయటంతో ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు.

సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ రంగనాథ్‌.. విద్యుత్‌ ఎస్‌సీ కృష్ణయ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం సుమారు 2గంటలకు విద్యుత్‌ పునరుద్ధరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో విద్యుత్‌ ఉద్యోగులకు పాస్‌ ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడున్నర గంటల పాటు విద్యుత్‌ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులు ఇబ్బంది పడ్డారు. దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానమిచ్చారు. అయితే తాము పోలీస్ ఠాణాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయలేదని.. బ్రేక్ డౌన్ అయినందునే ఇబ్బంది తలెత్తిందని ట్రాన్స్‌కో డీఈ చెప్పడం గమనార్హం.

లాఠీఛార్జీని ఖండించిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయ‌డాన్ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైతే ఉ.9.40 గం.ల‌కే సామాన్య ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర సేవలు అంద‌జేస్తున్న విద్యుత్, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్ర‌తినిధుల‌పై సైతం లాఠీల‌తో దాడుల‌కు పాల్ప‌డ‌టంపై మండిప‌డ్డారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రాణాల‌పై ఆశ ఉంద‌ని, క‌రోనా ప‌ట్ల అవ‌గాహ‌న ఉంద‌ని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయం మొదలైన తర్వాత పది నిమిషాలు ఆల‌స్య‌మైతే విడిచిపెట్టాలి కానీ, 10 నిమిషాల‌ ముందే ప్ర‌జ‌లు, స‌ర్కార్ మిన‌హాయింపు ఇచ్చిన సిబ్బంది, ఉద్యోగుల‌పై లాఠీ ఛార్జీ చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని