ఇకపై సర్టిఫికెట్లలో పేర్లు మార్చుకోవచ్చు
close

తాజా వార్తలు

Updated : 03/06/2021 18:14 IST

ఇకపై సర్టిఫికెట్లలో పేర్లు మార్చుకోవచ్చు

గుర్తింపు హక్కు భావ ప్రకటనాస్వేచ్ఛలో భాగం: సుప్రీంకోర్టు
నిబంధనల సవరణకు సీబీఎస్‌ఈకి సూచన

దిల్లీ: సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది. సీబీఎస్‌ఈ నిబంధనల చెల్లుబాటుపై పలు హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీళ్లపై జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు హక్కు భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని ధర్మాసనం తెలిపింది. సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ లేదా తమ తల్లిదండ్రుల పేర్లను మార్చుకోవచ్చని పేర్కొంది. పేరు మార్పునకు అనుమతించని సీబీఎస్‌ఈ నిబంధనలు చట్ట ప్రకారం చెల్లవని చెప్పింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే అధికారం సీబీఎస్‌ఈకి లేదని తెలిపింది. పేర్ల మార్పిడి కోసం పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు లాంటి ప్రభుత్వం ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. అయితే వాటిలో పేర్లు.. ఇతర అన్ని అధికారిక రికార్డులకు అనుగుణంగా ఉండాలని సూచించింది. విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు సహా ఇతర వివరాలను మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈకి దిల్లీ హైకోర్టు గతేడాది అక్టోబరులో సూచించింది. అయితే ఓ వ్యక్తి గుర్తింపు వివరాలను ధ్రువీకరించే అధికారం బోర్డుకు లేదని, కేవలం ప్రారంభంలో ఇచ్చిన వివరాలను సర్టిఫికెట్లలో నమోదు చేస్తుందని సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని