పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి: లోకేశ్‌

తాజా వార్తలు

Updated : 06/02/2021 19:34 IST

పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి: లోకేశ్‌

అమరావతి: మాస్క్‌ లేదని పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి చెందాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కిరణ్‌ మృతి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. ఎస్సీలపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. ఎస్సీల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీలపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ప్రకాశం జిల్లాలోని చీరాలకు చెందిన ఎస్సీ యువకుడు కిరణ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని