వైభవంగా భద్రాద్రి రాములోరి కల్యాణం
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 15:23 IST

వైభవంగా భద్రాద్రి రాములోరి కల్యాణం

భద్రాద్రి: భద్రాచలంలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అభిజిత్‌ లగ్నంలో కల్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు. రాముడి దోసిట నీలపు రాసులు.. సీతాదేవి దోసిట కెంపులు తలంబ్రాలుగా మారాయి. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సాధారణ భక్తులు లేకుండానే వేడుకలను నిర్వహించారు. రాములోరి కల్యాణ వేడుక కోసం ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. మెట్ల దగ్గర నుంచి కోవెల లోపల అన్ని వైపులా మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.

నిత్య కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాన్ని సుందరంగా అలంకరించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరో మంత్రి పువ్వాడ అజయ్‌ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. వేడుకల్లో భాగంగా గురువారం సీతారామస్వామికి మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచల క్షేత్రంలో ఏడాదికి ఓ సారి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని