నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

తాజా వార్తలు

Updated : 07/06/2021 20:35 IST

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

అమరావతి: నెల్లూరు జీజీహెచ్‌ లైంగిక వేధింపుల ఆడియో రికార్డింగ్‌ టేపులు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాటి ఆధారంగా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు సమర్పించిన ప్రాథమిక నివేదిక సిఫార్సుల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. జూన్ 5న ఆయనపై తాత్కాలిక చర్యలు తీసుకుంటూ కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేయగా, ఇప్పుడు సస్పెండ్‌ చేసింది. ఆడియో రికార్డింగ్‌ ద్వారా బయటకు వచ్చిన వేధింపుల ఘటన పది నెలల క్రితం జరిగినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పాటు ప్రసార మాధ్యమాల్లో రావటంపై రెండు కమిటీలు విచారణ జరిపి ప్రభాకర్‌పై చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేసింది. వైద్యారోగ్యశాఖ విచారణ సమయంలోనూ ఆయన నెల్లూరు విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని