Corona: ఆపదలో ఆత్మబంధువుల్లా..
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఆపదలో ఆత్మబంధువుల్లా..

బాధితులకు బాసటగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు

విజయనగరం: కరోనా మహమ్మారి ప్రజల మధ్య దూరాన్ని పెంచుతోంది. సాయం చేసే మనుషులున్నా.. సాయం చేయాలనే మనసున్నా.. వైరస్‌ భయంతో ముందుకురాని పరిస్థితి. మందులు, ఆహారం, ఆసుపత్రి వంటి అవసరాలే కాదు చివరి మజిలీకి ఆ నలుగురు కరువైన దుస్థితి. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కీలక తరుణంలో ప్రాణవాయువును అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. 

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి మరింత విజృంభిస్తున్న వేళ ఆక్సిజన్‌కు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడుతోంది. రోజుకు 1300 నుంచి 1400 ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమవుతున్నాయి. కానీ జిల్లాలో ఉన్న రెండు యూనిట్లలో రోజుకు 800 సిలిండర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రాణవాయువు సకాలంలో లభించక రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆక్సిజన్‌ కోసం విశాఖకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో విజయనగరం జిల్లాలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువు అందించి ఊపిరిపోస్తున్నాయి. 

రోటరీ క్లబ్‌ మొదటి దశలో పది సిలిండర్లు అందుబాటులో ఉంచి సుమారు 50 మందిని ఆదుకుంది. ప్రస్తుతం మరో పది సిలిండర్లను కొనుగోలుచేసి కొవిడ్‌ బాధితులకు అందుబాటులోకి తెచ్చింది. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు ప్రాణవాయువు అవసరాన్ని గుర్తించి కరోనా మొదటి దశలో నాలుగు, రెండో దశలో 12 సిలిండర్లను కొనుగోలు చేసి బాధితులకు తమవంతు సాయం చేస్తున్నారు. మార్వాడీ యువ మంచ్‌ సభ్యులు 18 సిలిండర్లను అందుబాటులోకి తెచ్చారు. విజయనగరంలో స్వచ్చంద సంస్థలు, దాతలు అందిస్తున్న సేవలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోనే తమకు ఆనందం ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని